Friday, June 02, 2006

గాంధి గారి సత్యంతో ప్రయోగాలు -- నా సందేహాలు:

ఎప్పట్నుంచో అనుకుంటూ ఇప్పటికి "గాంధి గారి సత్యంతో ప్రయోగాలు" చదవడం సాద్యపడింది.ఎన్నో సార్లు నాకు తెలియకుండానే నా కంట్లో నీరు కారింది. కస్తూరిబ పడిన బాధలు తల్చుకుంటే గుండె ద్రవించింది. ఈ రోజుల్లో ఐతే ఏ ఇల్లాలు ఐనా గాంధీ గారికి విడాకులు ఇచ్చి ఉండేది.తనకున్న జ్ఞానమే అసలైన జ్ఞానమని ఆయన ఎలా అనుకున్నాడో?పైగా తను నమ్మిన సిద్దాంతాన్ని తన బార్య తప్పనిసరిగా పాటించలి అని ఎలా అనుకున్నాడో? అహింసను ఆరాదిస్తూనే యుద్దనికి సహాయపడటం ఏమిటి? ఇందుకు తను ఇచ్చిన వివరణ నాకెందుకో సరైనదిగా అనిపించలేదు. బహుశా శతృవుకు (తను ఎవిరిమీద పొరాటం చేస్తున్నాడో వారికి) సహయం చెయ్యడంలో ఉన్న ఆనందం, అహింస మేద ఉన్న భక్తిని మించి పోయి ఉంటుందేమో?
సాదా జీవనం అమలు చేయటంలో కూడా ఒక్కోసారి రాజీ పడ్డాడని పించింది.ఏదైనా అనుకున్న సిద్దాంతాన్ని అమలు చేయటంలో ఇబ్బంది ఎదురైతే అవి మౌనంగా అనుభవించాలన్నాడు. కాని ఒక సందర్భంలో మూడవ తరగతిలో స్థలం లేక స్థలం ఉన్న ఎక్కువ ఖరీదైన పెట్టెలోకి మారాడు. ఇంకోచోట ఆరుబయట స్నానం చేయల్సి వచ్చేసరికి కస్తురిబా ఎగువ తరగతి వారి స్నానపు శాలలో స్నానం చేయడానికి అడ్డు చెప్పలేదు. ఐతే వేటి అన్నింటినీ ఆయన స్వచ్చంగా ఒప్పుకున్నాడనుకోండి.ఐతే ఇలాంటి సమయాన్ని బట్టి సర్దుకోవడం, బార్య, కొదుకు మంచమ్మీద రోగంతో ఉన్నపుడు, డాక్టర్లు చెప్పినట్లు (మాంసం చారు గాని గుడ్డు కాని ఇవ్వడనికి) ఒప్పుకోలేదు.సత్య ఉల్లంగన చిన్న విశయంలో జరిగనా పెద్ద విశయంలో జరిగినా, ఉల్లంఘనా తీవ్రత ఒక్కటే కాదా? మాంసాదులతో పాటు పాలు కుడా మానివేసినాయన మేక పాలు మాత్రం ఎందుకు పుచ్చుకున్నట్లు? ఐతే దీనికి తను చింతించాడు అనుకోంది. కాని బార్య అనారోగ్యం విశయంలోను, కొదుకు అనారోగ్యం విశయంలోను అలంటి రాజీకి రాలేక పోయాడు.
బ్రహ్మచర్యం విశయంలోనూ నాకు సందేహాలే.కామము, భోగం తుచ్చమైనవి ఎలా ఔతాయో నాకు బోధపడదు. ఇందుకు ఆయన భగవద్గీత నుంచి ప్రభావశీలి ఐనట్లుగా అనిపిస్తుంది.కాని నాకు తెలిసిన కొద్ది జ్ఞానంతో ఆలోచిస్తే, గీతలో భగవంతుదు, "నిష్కామ" (కామము అనగా కోరిక లేని కర్మ) చేయాలంటాడు కదా? దీన్ని కూడా అ కోవలో అర్తం చేసుకోలెమా?ఈ విశయంలో నేను చలంను సమర్థిస్తాను. ఇద్దరూ సుఖించగల కార్యం పాప కార్యం ఎలా అవుతుంది?దీని మీద మరోసారి చర్చిద్దాం.
ఇలాంటివే సందేహాలు ఇంకా చాలా కలిగాయి.
అయితే ఒక్క విశయం మాత్రం స్పష్టం. సత్యం మీద ఆయన చిత్తశుద్ది అమోఘం. శుద్దాత్మ శక్తి మీద ఆయనకున్న విశ్వాసం స్వచ్చం. గాంధీ గారికి లభించిన ఆదరణే శుద్దాత్మ శక్తికి ప్రబల నిదర్శనం.నీతి, ధర్మం, స్వచ్చత, వినయం మనిషిని ఉన్నతుని చేస్తాయనడంలో నాకు ఇసుమంతైనా అనుమానం లేదు.
సమయాబవం వల్ల ఇక్కడితొ ఆపెస్తున్నను.మరోసారి మరిన్ని విశయాలతో...
మీ అబిప్రాయాలు, సద్విమర్షలకు స్వాగతం.
-- స్పందన

4 Comments:

At 11:34 AM, Blogger రానారె said...

గాంధీ గారు కూడా మనిషేకదండీ. తప్పులు చేయటం సహజం. వాటిని గుర్తించి ఒప్పుకొని బయటికి చెప్పుకొని దిద్దుకొనే ప్రయత్నం మహనీయం. ఆ అనుభవాలను ధైర్యంగా మనతో చెప్పగలగడం ఒక్క మహాత్మునికే చెల్లు. నేర్చుకొందాం. ఎక్కడో చదివాను "తన డైరీని ఎవరైనా చదువుతారేమో అనే భయంలేనివాడు యోగి" అని.

 
At 10:07 AM, Anonymous Anonymous said...

"స్పందన" గారూ,
మీరూ, నేనూ చాలా విషయాల్లో ఏకీభవిస్తున్నామనిపిస్తోంది.ఐతే తేడా ఎక్కడొచ్చిందంటే మీరు తెలుగుజాతిని ఓ నేషన్‌గా అంగీకరించరు. మనం పుట్టి పెరిగిన వాతావరణంలో అది చాలా సహజం. నేను ఇండియా అనేదాన్ని ఓ దేశంగా పరిగణించను. నా దృష్టిలో బ్రిటీషువారి నిష్క్రమణానంతరం ఆంధ్రా ఇండియన్ యూనియన్ (అనబడే హిందీ సామ్రాజ్యం) లో చేరడం ఓ బాల్యవివాహంలాంటిది.దానికి విలువ లేదు. మీరు దాన్ని దురభిమానమని పేర్కొంటూ, దాన్ని ఇతరవిధాలైన సంకుచితత్వాలతో సమానం చేశారు. సంతోషం. మీతో వాదించడం లేదా, మిమ్మల్ని తార్కికంగా ఒప్పించడం నా అభిమతం కాదు. తెలుగుజాతి కూడా ఒక నేషన్ అనే రియలైజేషన్ నాలో ఎన్నో సంవత్సరాల తర్వాత కలిగించిన ఆ భగవంతుడు అదే రియలైజేషన్ ని అందరిలోనూ కలిగించాలని కోరుకుంటున్నాను. మీరు ఉంటున్న US లో కొంతమంది తమిళులు తెలుగు అసలు ఓ ప్రత్యేకభాషే కాదనీ, అసలు దక్షిణాదిన అందరూ తమిళే మాట్లాడతారనీ, తెలుగు తమిళానికి మాండలికమనీ తెల్లవారివద్ద ప్రచారం చేస్తున్న విషయం మీ దృష్టికి రాలేదా ? ప్రతిదానికీ తమిళులే కారణమని నేను అనట్లేదు. మీకు తెలీకపోవచ్చు గానీ తెలుగు ఎదక్కుండా చెయ్యడానికి తమిళులు పోషిస్తున్న సైంధవపాత్ర నాకు బాగా తెలుసు. అలాంటి విషయాలు తెలియజెయ్యడానికే ఈ వ్యాసాలు రాస్తున్నాను.

 
At 1:56 PM, Anonymous Anonymous said...

I wish to let you know that I have no objection to the separate Telangana demand. If identity is nonsense, Of all, the Indian identity is more so. It is the king of all nonsenses.

 
At 1:04 PM, Anonymous Anonymous said...

మీ వ్యాఖ్య ఇప్పుడే చూశాను. తెలుగుజాతీయవాద అంశం మీద నా పోస్టింగులు ఇంకా పూర్తికాలేదు. anyway, it is not wrong to call spade a spade దొంగని దొంగ అన్నందుకు ఎవరూ hurt అవ్వాల్సిన పన్లేదు.
ఇహపోతే, మీ "పలుకు" నేను చూస్తున్నాను.నేను మహత్మాగాంధి మీద కొంత అధ్యయనం చేశాను.ఐతే ఎవరితోనూ అలాంటి విషయాలు పంచుకోలేదు. సమస్య ఏంటంటే- exact sciences లో రెండో అభిప్రాయానికి తావుండదు. రెండు రెళ్ళు నాలుగే అయితీరాలి. సామాజికశాస్త్రాల్లో ఏకాభిప్రాయానికి తావులేదు. అందుచేత అలాంటివాటిల్లో ego clashes తప్ప వేరే ప్రయోజనం లేదనే దృష్టి నాకేర్పడింది. -అంబానథ్

 

Post a Comment

<< Home