Monday, June 05, 2006

దేవుడున్నాడా? -- dEvuDunnADA?


పుణ్యాత్ముని మరియు దుర్మార్గుని పట్ల డేవుడు ఒకే పక్షపాతం చూపిస్తాడా?
పాప పుణ్యాల కర్మ పలితాలు తర్వాతి జన్మలకు అనుసరిస్తాయా?
అసలు పునర్జన్మలంటూ ఉన్నాయా?
ఏది పాపం? ఏది పుణ్యం?
జన్మ యొక్క పారమార్థికత ఏమిటి?
మోక్షం అనగా ఏమిటి? అది ఎలా సిద్దిస్తుంది?
ఇహ లోకంలో లేని స్వర్గనరకాలు పరలోకంలో ఉన్నాయా?
వివిధ మతాలు మనిషిలో పాపభీతి కలిగించుటలో ప్రవక్తల, సాదు జనుల, దైవావతారుల అంతర్లీన భావ మేమిటి?
డేవుడు నిర్వికారుడూ, నిర్గుణాకారుడా?
అతని పేరు మీద భజనలు, భక్తి, తంత్రాలు, మంత్రాలు అవసరమా?
ఏది అసలైన దైవ సేవ?
అసలు పాపభీతితో దైవసేవ చేయటం అవసరమా?
నా అభిప్రాయాలు తర్వాతి బ్లాగులో.. మీ అభిప్రాయాలు చెప్పండి.

3 Comments:

At 8:55 AM, Blogger Rohiniprasad Kodavatiganti said...

All feelings about god and other 'divine' powers are a result of our limited, anthropocentric imagination. Humans, by definition, evolved from other animals because of their ability to see and notice 'patterns' behind every phenomenon. The unfortunate result is that we see them even where none exist. The other deeply ingrained idea is causality. We cannot imagine that something can come into existence without someone having to cause it to exist.

 
At 9:44 PM, Blogger రానారె said...

ఇవి కేవలం నా వ్యక్తిగత అభిప్రాయాలు.

పుణ్యాత్ముణ్ణి సృష్టించిన దేవుడే పాపాత్ముణ్ణీ సృష్టించాడు. ఆయనకు ఇద్దరూ సమానమే.

పునర్జన్మ ఉందంటే భయపడి సజ్జనుడైనవాడు, లేదంటే దుర్జనుడైనవాడు మనిషి కాడు.

పుణ్యం పాపం ఉన్నయి అనే భావన మనిషిని అస్వతంత్రుణ్ణి చేస్తుంది. పుణ్యాన్ని ఒక ఖాతాలో జమకట్టి మరుజన్మలో వాడుకొందామనుకొనే వాడు స్వార్థపరుడు.

మన ఆలోచనలు దేవుడు గమనించి మరుజన్మలో మనకు బహుమానం లేక శిక్ష ఇస్తాడనుకోవడం మామూలు. మనిషి తన మనసులోని ఆలోచనలు ఎలా గమిస్తున్నయో గమనించగలిగి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే దేవునికి పనే ఉండదు. దేవునికి పనిలేకుండా చేయడమే మోక్షం. సత్యము మిమ్ములను ముక్తులను చేయును అన్నాడు క్రీస్తు.

పరలోకాలు నాకు తెలియవు. తన సంతోషమె స్వర్గము తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ.

భగవద్గీత లో పాపభీతిని గురించిన ప్రస్తావన ఉందని నాకు తెలియదు. మనిషి మనిషిగా బ్రతకడం ఎలా అన్నదే గీత బోధిస్తుంది.

దేవుడు నిర్వికరుడా నిర్గుణుడా తెలుసుకొనటం కంటే మన వికారాలేమిటి గుణాలేమిటి తెలుసుకొని గుర్తెరిగి మసలుకొనతం అవసరం.

దేవుడు భజనలు చేయమని అడినట్లు ఏ పురాణంలోనూ లేదు. పనియే దైవం అన్నాడు గాంధి. మన పనులు మనం చేసుకొందాం. పనిని, చేసేవారిని గౌరవిద్దాం.

మానవ సేవే మాధవ సేవ. అదే అసలైన దైవ సేవ.

పాప భీతితో దైవ సేవ చేయటం, భయపడి గూండాలకు నమస్కరించడం ఒక్కటే. దీనికి వివరణ అవసరం లేదనుకుంటాను.

 
At 10:05 AM, Anonymous Anonymous said...

"స్పందన" గారూ,
మీరూ, నేనూ చాలా విషయాల్లో ఏకీభవిస్తున్నామనిపిస్తోంది.ఐతే తేడా ఎక్కడొచ్చిందంటే మీరు తెలుగుజాతిని ఓ నేషన్‌గా అంగీకరించరు. మనం పుట్టి పెరిగిన వాతావరణంలో అది చాలా సహజం. నేను ఇండియా అనేదాన్ని ఓ దేశంగా పరిగణించను. నా దృష్టిలో బ్రిటీషువారి నిష్క్రమణానంతరం ఆంధ్రా ఇండియన్ యూనియన్ (అనబడే హిందీ సామ్రాజ్యం) లో చేరడం ఓ బాల్యవివాహంలాంటిది.దానికి విలువ లేదు. మీరు దాన్ని దురభిమానమని పేర్కొంటూ, దాన్ని ఇతరవిధాలైన సంకుచితత్వాలతో సమానం చేశారు. సంతోషం. మీతో వాదించడం లేదా, మిమ్మల్ని తార్కికంగా ఒప్పించడం నా అభిమతం కాదు. తెలుగుజాతి కూడా ఒక నేషన్ అనే రియలైజేషన్ నాలో ఎన్నో సంవత్సరాల తర్వాత కలిగించిన ఆ భగవంతుడు అదే రియలైజేషన్ ని అందరిలోనూ కలిగించాలని కోరుకుంటున్నాను. మీరు ఉంటున్న US లో కొంతమంది తమిళులు తెలుగు అసలు ఓ ప్రత్యేకభాషే కాదనీ, అసలు దక్షిణాదిన అందరూ తమిళే మాట్లాడతారనీ, తెలుగు తమిళానికి మాండలికమనీ తెల్లవారివద్ద ప్రచారం చేస్తున్న విషయం మీ దృష్టికి రాలేదా ? ప్రతిదానికీ తమిళులే కారణమని నేను అనట్లేదు. మీకు తెలీకపోవచ్చు గానీ తెలుగు ఎదక్కుండా చెయ్యడానికి తమిళులు పోషిస్తున్న సైంధవపాత్ర నాకు బాగా తెలుసు. అలాంటి విషయాలు తెలియజెయ్యడానికే ఈ వ్యాసాలు రాస్తున్నాను.

 

Post a Comment

<< Home